ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అవమానించారంటూ కన్నీటి పర్యంతమైన మహిళా సర్పంచ్
టీడీపీ ఎమ్మెల్యే తనను అవమానించారంటూ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ మహిళా సర్పంచ్ కన్నీటి పర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈమేరకు ఆమె ఆరోపించారు. ‘మూడు రోజులలో నా చెక్ పవర్ రద్దు చేయించి నీ అంతు చూస్తా’ అంటూ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ బెదిరించాడని సర్పంచ్ గోవింద్ బాయ్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యే తనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని, టీడీపీ కోసం కష్టపడిన వారిని దగ్గరకు రానీయడం లేదని పార్టీ నేతల వద్ద వాపోయినట్లు సమాచారం.